సింగరేణి కార్మికులకు శుభవార్త…ప్రజా భవన్ వేదికగా 10 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి చేతుల మీదుగా సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. 2023- 24 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి.
ఈ లాభాలలో 33 శాతం 796 కోట్లను కార్మికులకు బోనస్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల రూపాయలను బోనస్ గా ప్రకటన చేశారు. గతం తో పోల్చుకుంటే ఈసారి 20వేల ఎక్కువగా బోనస్ వస్తోందట.
సింగరేణి చరిత్రలోనే ఈసారి అత్యధిక బోనస్ ప్రకటించిందట ప్రభుత్వం. 1998- 99 నుంచి లాభాల్లో వాటా పంచే ఆనవాయితీ కొనసాగిస్తోంది సింగరేణి. గతేడాది 1227 కోట్ల లాభం నుంచి 30 శాతం బోనస్ ప్రకటించింది సింగరేణి. గతంలో ఎన్నడు లేని విధంగా సింగరేణిలోని కాంట్రాక్ట్ కార్మికుల కూడా ఈసారి ఐదువేల బోనస్ ప్రకటన చేసింది.