కేంద్రం ఎదుట విన్నపాల చిట్టా విప్పిన సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, రావాల్సిన నిధుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధానితో సమావేశమై రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంభవించిన వరదలు, రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి వరద సహాయాన్ని పెంచాలని కోరనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ మధ్య మొదలుపెట్టిన మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విన్నవించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news