తిరుమల భక్తులకు శుభవార్త..అలిపిరి నడక మార్గంలో త్వరలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఈఓ శ్యామలరావు. దర్శనానికి వెళ్ళిన భక్తులుకు కోరినన్ని లడ్డులు అందజేస్తామని తెలిపారు.
న్యాణమైన నెయ్యి కోనుగోలు కోసం టెండర్ నిబంధనలతో మార్పు తీసుకువచ్చామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత పరిశీలనకు నేషనల్ డైరి బోర్డు టీటీడీ కి 80 లక్షల రూపాయలు విలువ చేసే పరికరాలను విరాళంగా అందిస్తున్నారు.
అలిపిరి నడక మార్గంలో భక్తులకు టోకేన్లు జారి పున:రుద్దరణ చేస్తామని వివరించారు. సర్వదర్శనం భక్తులుకు వారానికి 1.63 లక్షల టోకేన్లు జారి చేస్తున్నాం. అన్న, ప్రసాదాల తయారిలో వినియోగిస్తున్న సేంద్రియ వ్యవసాయ పదార్దాల వినియోగం పై కమిటిని నియమించామని చెప్పారు. టీటీడీ లో ఆధార్ వినియోగం పై కేంద్రం నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే నోటిఫికేషన్ వెలుపడుతుందన్నారు ఈఓ శ్యామలరావు..