నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల ఏపీ ప్రభుత్వానికి, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ ప్రజలకు కలిగిన నష్టం ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు అనుకూలంగా తీసుకున్నారో లేక అభిమానంతో తీసుకున్నారో తెలియదు కానీ… నాడు కరోనా కేసులు ఎక్కువగా లేని సమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల 14వ ఆర్థిక సంఘం నిధులు ఏపీకి రాకుండా ఆగిపోయాయి!
అవును… ఏపీ ప్రజలు వింటున్నది నిజమే! మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అలా తీసుకున్న ఓ వ్యక్తి నిర్ణయం కారణంగా రాష్ట్రానికి రావాల్సిన మూడు వేల కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. కరోనా స్టార్టింగ్ దశలోనే ఈ నిధులు వచ్చి ఉంటే… నేడు రాష్ట్రానికి ఇన్ని కష్టాలు ఉండేవి కావనేది ఏపీ సర్కార్ వాదన!
మరి చంద్రబాబుపై ప్రేమ, అభిమానం అనేవి నిమ్మగడ్డకు ఉంటే ఉండోచ్చు కానీ… ఆ ప్రేమల వల్ల ఏపీ ప్రజలు నష్టపోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఆ ప్రేమల వల్ల ఏపీ సర్కార్ కి అన్ని వేల కోట్ల నష్టాలు ఎందుకు? ఏపీ ప్రజలు చేసిన నేరమేమిటి? ఏపి ప్రజలు చేసిన తప్పేమిటి? 2019 ఎన్నికల ఫలితాల ఫలితంగా చంద్రబాబుకు ఏపీ ప్రజలపై ఉన్న కక్ష తీర్చుకుంటున్నారా? నిమ్మగడ్డ – బాబు ద్వయానికే తెలియాలి!!