డాక్టరమ్మ గొప్ప మనసు.. జీజీహెచ్‌కు రూ.20 కోట్ల ఆస్తి విరాళం

-

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు. ఈ మాటను అక్షరాల ఒంట బట్టించుకున్న ఓ డాక్టర్ తన జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్మును దానం చేశారు. అమెరికాకు చెందిన డాక్టర్ ఉమ గవని.. తన యావదాస్తిని గుంటూరు జనరల్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు. మొత్తం రూ.20 కోట్ల ఆస్తిని గుంటూరు జీజీహెచ్‌లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి డాక్టర్ ఉమ విరాళం ప్రకటించారు.

గుంటూరు జిల్లాకు చెందిన ఉమ గుంటూరు మెడికల్ కాలేజీలో 1965లో మెడిసిన్‌ చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య పూర్తి చేసి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి.. అక్కడే డాక్టర్‌గా స్ధిరపడ్డారు. అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాలకు వెళ్లారు. ఈ వేదికపై తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెల్లడించారు. ఉమ తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news