జగన్ కు ట్విస్ట్.. కీలక లిస్ట్ విడుదల చేసిన చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్  పునర్ వ్యవవస్థీకరణ  జరిగిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  చాలా హామీలు ఇచ్చారు. అందులో చాలా వరకూ హామీలు నెరవేర్చారు. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు పాలన సాగించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్  పాదయాత్ర చేయడంతో 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ జగన్ దక్కించుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించారు.

టీడీపీ అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్లో ఎన్నికల మేనిఫెస్టోను తీయడంపై విమర్శలు కురిపించారు. ఆరువందల హామీలు ఇచ్చి చంద్రబాబు మాట తప్పారని పదే పదే గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు. దీంతో మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2024లో ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామంటూ లిస్ట్ విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version