ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలు నిన్న రాత్రి రిలీజ్ అయ్యాయి. డీఎస్సీ నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసింది. టెట్ మార్కులపై అభ్యంతరాలు ఉన్నట్లయితే అప్డేట్ చేసుకోవడానికి ఈరోజు, రేపు అవకాశం కల్పించారు.

అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.