అంబులెన్స్ రాకపోవడంతో, యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో దారుణంగా వైద్యశాఖ దుస్థితిలో ఉందని చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలో బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి యువతి గూగులోత్ హారిక పాల్పడింది.

అంబులెన్స్‌కు ఫోన్ చేసినా ఎంతసేపటికి రాకపోవడంతో, బైక్‌పై యువతిని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు.