జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని చంద్రబాబును అరెస్ట్‌ చేశారు – ధూళిపాళ్ల

-

చంద్రబాబు అరెస్ట్‌ పై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల సీరియస్‌ అయ్యారు. నిన్న అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా నడిపారని.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసిన పనిని.. డీఐజీ చేయాల్సిన అవసరం ఏముంది..? అని ఫైర్ అయ్యారు. జగన్ మెప్పు కోసం డీఐజీ రఘురామిరెడ్డి వెళ్లారు….జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని డీఐజీ రఘురామిరెడ్డి చంద్రబాబు వద్దకు యుద్దానికెళ్లినట్టు వెళ్లారని ఆగ్రహించారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు.. డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇచ్చిందని.. 2021లో ఈ కేసు నమోదు చేస్తే.. 20 నెలల కాలంలో ఛార్జీ షీట్లు వేయలేదని మండిపడ్డారు. ఈ కేసులో చాలా మందిని తెచ్చారు.. విచారించారు…ఎవరో ఒకరితో చంద్రబాబు పేరు చెప్పించాలని ప్రయత్నించారని ఆగ్రహించారు. చంద్రబాబుకేం ఇచ్చారని సీమెన్స్ ఉద్యోగి సుమన్ బోసును అడిగితే.. పుస్తకం ఇచ్చానన్నాడని.. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సెంట్రల్ టూల్ డిజైన్ ఏజెన్సీనే స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని మదింపు చేసిందని ఆగ్రహించారు.అధికారం కొల్పోతున్నామనే అయహనంతోనే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని..స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన వారి విషయంలో ప్రాథమిక ఆధారం లేదని కోర్టే చెప్పారన్నారు ధూళిపాళ్ల.

Read more RELATED
Recommended to you

Latest news