ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా ఉత్సవాలు..పోటెత్తిన భక్తులు..

-

విజయవాడ ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పోటెత్తారు. విజయవాడ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు.. తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి కుంకుమ పూజలు. దీంతో సామూహిక పూజలకు భారీగా తరలివస్తున్నారు మహిళలు.

Dussehra celebrations on the 8th day of Indrakiladri

ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభా కాంక్షలు చెప్పారు.

అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version