నేటి నుంచి బెజవాడలో దసరా‌నవరాత్రి మహోత్సవాలు.. అంతా కట్టుదిట్టం !

-

నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుండి ఈ నెల 25 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. ఇక ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ స్వర్ణకవచాలంక్రుత శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శమనివ్వనున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి ఇస్తున్నారు అధికారులు.

అయితే కోవిడ్‌ ద్రుష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. స్లాట్ లేని, మాస్క్ ధరించని భక్తులకు అనుమతి ఉండదు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యక్ష పూజలకు అనుమతి లేకపోగా పరోక్షంగా జరిగే పూజలను వీడియో లైవ్ ద్వారా వీక్షించే అవకాశం ఇస్తున్నారు. ఇక ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పది సంవత్సరాల లోపు పిల్లలకు 60 ఏళ్ల పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news