జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి. పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ గా కాదు… నా మీద కాకినాడ ఎమ్మెల్యే గా పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి.
ఎక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండదని…పై నుంచి ఆదేశాలు రావాలని సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ పార్టీ కాకినాడ లో గుండు సున్నా అంటూ ఎద్దేవా చేశారు. గాజు గ్లాస్ అయిన నా మీద పోటీ పెట్టాలని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి.