రోహిత్… CSK కెప్టెన్ కావాలని కోరారు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్ కు గురిచేసింది. ముంబై నిర్ణయాన్ని హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ టాస్ టైం లో రోహిత్ ను కెప్టెన్ గా చూడలేమంటూ ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. “గుండె రాయి చేసుకోక తప్పేలా లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ తరుణంలోనే…ధోని రిటైర్మెంట్ అయిన తర్వాత..రోహిత్… CSK కెప్టెన్ కావాలని కోరారు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. రోహిత్ శర్మ మరో 6 ఏళ్లు ఐపీఎల్ ఆడతాడు..అందుకే CSK కెప్టెన్ కావాలని కోరారు అంబటి.