తిరుమల భక్తులకు అలర్ట్‌…ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు !

-

తిరుమల భక్తులకు అలర్ట్‌…ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పై జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించిన ఇఓ దర్మారెడ్డి.. కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది అధిక మాసం కావడంతో శ్రీవారికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. సెప్టెంబర్ 18వ తేదిన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుందన్నారు ఇఓ దర్మారెడ్డి. 23వ తేదీన గరుడ వాహన సేవను నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవ రోజున ఘాట్ రోడ్ల లో ద్విచక్రవాహనాలను అనుమతించబోమని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు నిర్వహించే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నట్లు ప్రకటించారు ఇఓ దర్మారెడ్డి. దర్శనంలో సామాన్య భక్తులుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తూన్నామని.. భక్తులు సౌకర్యార్దం ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టిసి బస్సులను నడుపుతామని ప్రకటించారు. వాహన సేవలు ఉదయం 8 గంటలకు….రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామన్నారు ఇఓ దర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news