తెలంగాణలో వైఎస్ షర్మిల..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి దాదాపు రెడీ అయిపోయారు. తాజాగా ఆమె..సోనియా గాంధీతో భేటీ కావడంతో..ఇంకా విలీనం కథ చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. ఇక ఈ భేటీ తర్వాత ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని, సీఎం కేసీఆర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. కానీ కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై ఆమె స్పందించలేదు. దీంతో విలీనంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
ఇదే సమయంలో ఆమె కాంగ్రెస్ లోకి వస్తే సీటు విషయం కూడా పెద్ద రచ్చ సాగనుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆ సీటు ఇవ్వాలి. అలా అని ఆమెని ఏపీకి వెళ్ళమని ఆదేశాలు ఇస్తే..ఇప్పటిలో వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ బలం జీరో..అలాంటప్పుడు అక్కడకెళ్లి ఇప్పటికిప్పుడు షర్మిల పెద్దగా కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడం కష్టమే..అలాగే ఆమె పోటీ చేసి గెలవడం అనేది కాస్త కష్టమైన విషయమే.
ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణలోనే ఉండటం ఖాయం. అయితే పాలేరు సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి.కానీ అదే సమయంలో బిఆర్‌ఎస్ లోని తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లోకి వస్తే మళ్ళీ సీన్ మారుతుంది. ఆయనకు పాలేరు సీటు ఇవ్వాల్సి వస్తుంది. తాజాగా పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సైతం..అటు తుమ్మల, ఇటు షర్మిల టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓడిపోయిన తుమ్మలకి పిలిచి కేసిఆర్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి చేయడం అన్యాయమా? అని నిలదీశారు. ఐదేళ్ళు మంత్రిగా జిల్లాను అప్ప చెబితే జిల్లాలో ఒక్క సీటు గెలవలేదు… తాను గెలవలేక పోయారని ఆగ్రహించారు. షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతుంది ? అంటూ ప్రశ్నించారు. ఆమె రెండేళ్లు గా ఏమి చెప్పింది..ఇప్పుడు ఏం చేస్తుందని అన్నారు. చూడాలి మరి షర్మిల అంశం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందో.