ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : పేర్ని నాని

-

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండి పడ్డారు. తాజాగా ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మే 13న ఎన్నికలు జరిగిన రోజు పాల్వాయి గేట్, కారంపూడి ఘటనల గురించి ప్రస్తావించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి పై పోలింగ్ రోజునే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. లోకేష్ ట్వీట్ చేయగానే స్పందించడం ఏంటి..? పిన్నెల్లినే అరెస్ట్ చేయమనే హక్కు ఈసీకి లేదు. కూటమి నేతలు ఎవ్వరినీ కోరితే వారినే ఈసీ నియమించి దుర్మార్గంగా వ్యవహరించింది.

ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులు ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే.. వారిపై కేసులు నమోదు చేయలేదు. ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు. పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news