గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

-

గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలని సూచించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇవాళ గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్ఛతాహి సేవా ముగింపు సభలో  ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం కంటే ముఖ్యమైనది పరిశుభ్రత అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికుల సేవ వెల కట్టలేనిది అన్నారు. 

నగర పరిశుభ్రతకు ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను మంత్రి నారాయణ దృష్టికీ తీసుకువెల్లి పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు గాను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్కిల్ కమ్యూనికేషన్ పై కూడా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏడాది లోపు పేరుకుపోయిన చెత్తను క్లీన్  చేయాలని మంత్రికి సూచించిన విషయం విధితమే. 

Read more RELATED
Recommended to you

Latest news