పిన్నెల్లి వీడియోపై ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. పిన్నెళ్లి రామకకృష్ణారెడ్డి ఇవిఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమీషన్ నుండి బయటకు వెళ్లలేదని వెల్లడించింది. మీడియా చిట్ చాట్ లో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..ఎమ్మెల్యే పిన్నెల్లి EVM ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పిఓ, ఏపిఓ లను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్స్ పెక్టర్ లతో బృందాలు పని చేస్తున్నాయన్నారు.
మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదు…అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందని వెల్లడించారు. టీడీపీ నేతలు వెళ్తే వైసీపీ నేతలు వెళ్తామని అంటారు..అప్పుడు మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని పేర్కొన్నారు. బయటి నాయకులు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదు….ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని నేను ఇప్పటికే సూచించానని వెల్లడించారు. ఈ సమయంలో పరామర్శలకు వెళ్లకూడదని నా సలహా….పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకకృష్ణారెడ్డి ఇవిఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమీషన్ నుండి బయటకు వెళ్లలేదన్నారు.పోలీస్ దర్యాప్తులో వీడియో ఎక్కడ, ఎవరి నుంచి బయటకు వెళ్లిందో తెలుస్తుంది….25వ తేది నుండి స్ట్రాంగ్ రూంలను పరిశీలన చేస్తామన్నారు.