పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంత మేరకైనా ధ్యానంగా ఉంటా : సీఎం రేవంత్ రెడ్డి

-

పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంత మేరకైనా ధ్యానంగా ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ మహాబోధి బుద్ధవిహార్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధ్యానం ఒక పనిగా కాదు.. ప్రతీ పనిని ధ్యానంగా చేయాలన్నారు. చదివితే రెండు లైన్ల మాదిరిగా ఉందని.. అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అందులోనే ఉందన్నారు.

మహాబోధి బుద్ధవిహార్కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం కోసం నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ప్రతిపాదనలు పంపితే కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సి బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. మంచి సందేశం, ఆలోచనను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచాలన్నారు. గౌతమ బుద్ధుడు బోధించిన సందేశం అందరికీ అవసరం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news