నాలుగోసారి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా..!

-

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పై ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ వైసీపీ ఛలో తుని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటివద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వైసీపీ నేతలు వెళ్లొద్దని నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

తొలుత వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా.. టీడీపీ కార్యకర్తలు అడ్డకున్నారు. తరువాత వైసీపీ కార్యకర్తలు చైర్మన్ నివాసంలో వద్దకు వెల్లారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వైసీపీ కౌన్సిలర్లు 17 మంది హాజరు కాకపోవడంతో అధికారులు తుని మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. త్వరలోనే ఎన్నికల తేదీని ప్రకటిస్తానని పీవో వెల్లడించారు. కోరం లేక వాయిదా వేసినట్టు పీవో ప్రకటించారు. మళ్లీ ఎప్పుడూ ఉంటుందనేది త్వరలోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news