ఏపీ ప్రజలకు అలర్ట్… APSRTCలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానుంది ఆర్టీసీ. అమరావతి, అనంతపురం, కడప, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి ఆర్టీసీ డిపోల నుంచి మొదటిసారిగా తిరగనున్నాయి ఎలక్ట్రిక్ బస్సులు.

వీటి కోసం కేంద్రం అందించే రూ. 190 కోట్లతో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ఇక అటు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుతుంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పథకం అమలుపై చర్చ, అనంతరం ఆమోదం ఉంటుంది.