కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమయింది. మోడీ ప్రభుత్వం దిగివచ్చేలా ఇవాళ ధర్నా నిర్వహించనుంది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ రిజర్వేషన్ ధర్నా నిర్వహించనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ధర్నా నిర్వహించబోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ ధర్నాలో
కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే , రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు హాజరుకానున్నారు.
ఇండియా కూటమి ఎంపీలు సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… కేంద్రానికి కనువిప్పు కలగాలనే బీసీ ధర్నాకు కూర్చుంటున్నామన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ నేతృత్వంలో చేసిన రెండు చట్టాలపై కేంద్రం కాలయాపన చేస్తోంది… తెలంగాణ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలనేదే మా ఉద్దేశ్యం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.