నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరుగుతుంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం పథకం అమలుపై చర్చ, అనంతరం ఆమోదం ఉంటుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్ట సవరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

LRS, BRSపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కొత్త బార్ పాలసీపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగనుంది. వచ్చే నెల 1 నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రారంభం కానుంది. ఇటీవల సింగపూర్ పర్యటన, పెట్టుబడులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డు జారీకి ఆమోదం తెలపనుంది క్యాబినెట్. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చ ఉంటుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.