విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ జనరల్ సెక్రెటరీ వెన్నపూస సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 10న ధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది అని.. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ధర్నా నిర్వహిస్తాం అని పేర్కొన్నారు. ఫిట్మెంట్ 8% తో అనుకూల సంఘాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మాకు మూడు డిఏ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు.
ఇస్తామన్న ఒక్క డిఏ ఆదేశాలు కూడా ఇంకా రాలేదు. విద్యుత్ రంగ కాంట్రాక్టు కార్మికులను ఇంకా రెగ్యులరైజ్ చేయలేదని.. 2018 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తామంటే మేం వ్యతిరేకించాం. యాజమాన్యం పీఆర్సీ పై పునః సమీక్షించాలి. జిల్లాల వారీగా ధర్నాలకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది.
కాంట్రాక్టర్లకు ఇచ్చే పేమెంట్లు 200% పెంచారు.. కార్మికులకు మాత్రం సరిగా పెంచలేదు అన్నారు. గుర్తింపు పేరుతో అనుకూల సంఘాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు ఎలాంటి పోస్టులు పెంచకపోవడం వల్ల పని భారం పెరిగిందని.. పెరిగిన పనిభారం ఆధారంగా వేతనాలు పెంచలేదు.. షిఫ్ట్ ఆపరేటర్లకు రకరకాల జీతాలు ఉన్నాయి.కార్మికులను విభజించే విధంగా జీఓ లు అమలు చేయకూడదన్నారు.