చిత్తూరులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఒంటరి ఏనుగు మృతి చెందింది. రామకుప్పం అటవీ ప్రాంతంలో సంతరిస్తున్న 14 ఏనుగుల గుంపు నుండి తప్పిపోయిన ఒంటరి ఏనుగు మృతి చెందిందని అటవీ అధికారులు ప్రకటించారు.

ఏనుగు మృతి చెంది నెల రోజులకు పైగా అయిఉంటుందని భావిస్తున్నారు అధికారులు. ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఏనుగు మృతదేహం లభ్యమైనట్లు ప్రకటించారు. ఏనుగు మృతి పై అనేక అనుమానాలు ఉన్నాయని… మృతి చెందిన ఏనుగు దంతాలు మాయం అయినట్లు వెల్లడించారు అధికారులు. ఏనుగు దంతాల కోసం వేటగాళ్లు హతమార్చి ఉంటారా అన్న అనుమానంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.