ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి : చంద్రబాబు

-

ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు పంచాంగ కర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. చంద్రబాబే రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతారని వెల్లడించారు. 

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండుగ ఉగాది అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు తీపి కబురు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.5వేలు కాదు.. రూ.10వేలు గౌరవ వేతనం అందజేస్తామని హామీ ఇచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version