శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి 3 రోజులు ఆ సేవలు రద్దు కానున్నాయి. శ్రీశైలంలో ఈ రోజు నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రావణ శనివారం, ఆదివారం, సోమవారాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో అభిషేకాలను రద్దు చేసినట్టుగా ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మిగతా రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. ఆగస్టు 8, 22వ తేదీల్లో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఉంటాయని తెలిపారు. ఆగస్టు 24వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన కోరారు.