తెగిపోయిన రోడ్డు.. పిల్లల కోసం ‘బాహుబలి బ్రిడ్జ్’!

-

గత మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో రోడ్లు సైతం కనిపించడం లేదు. ఇళ్లలో కూడా నీరు నిండిపోయి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి. పంజాబ్ లోని మల్లేయాన్ లో భారీ వర్షాలు పడడంతో రోడ్లు తెగిపోయాయి. దీంతో రోడ్డుపైన వెళ్తున్న 35 మంది పిల్లలు వరదలో చిక్కుకున్నారు.

Punjab Men Form Human Bridge To Rescue 35 Children Stranded After Road Cave
Punjab Men Form Human Bridge To Rescue 35 Children Stranded After Road Cave

కానీ ఆ పిల్లలను కాపాడడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఓ ఇద్దరూ యువకులు వారిని కాపాడేందుకు సాహసం చేశారు. స్కూల్ నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులను కాపాడేందుకు సుఖ్బిందర్ సింగ్, గగన్దీప్ సింగ్ లు వారే వంతెనగా మారారు. వారి పైనుంచి పిల్లలను క్షేమంగా ఒడ్డుకు చేర్చిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు రియల్ హీరోలు మీరే అని కామెంట్లు చేస్తున్నారు. పిల్లలను కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news