ఏపీ మంత్రి ‘బెంజ్’ మాటలు నమ్మశక్యంగా లేవా… అయ్యన్న దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో..?

-

. ఈ క్రమంలోనే ఏసీబీ పలువురు అధికారులతో పాటు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. అలాగే ఇందులో ఏ-14గా ఉన్న కార్తీక్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వెంటనే కార్తీక్‌కు బెయిల్ కూడా వచ్చింది. అటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా ఈ మధ్యే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ విషయాన్ని పక్కనబెడితే ఇందులో ఏ-14గా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి ప్రస్తుత కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం బినామీ అని, మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, ఖరీదైన బెంజ్ కారును కార్తీక్ గిఫ్ట్‌గా ఇచ్చారని, కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్‌ ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పి, మంత్రి కుమారుడు బెంజ్ కారుతో ఉన్న ఫోటోలని విడుదల చేశారు.

ఈ ఆరోపణలపై మంత్రి జయరాం కూడా స్పందిస్తూ… ఆ బెంజి కారు తన కుమారుడిది కాదని, వేరే వాళ్ల కారు పక్కన తన కుమారుడు ఫొటో దిగాడని చెప్పారు. హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫొటో తీసుకుంటే మనది అవుతుందా? అని ప్రశ్నించిన ఆయన, కారు తమదే అని రుజువు చేస్తే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. అయితే మంత్రి చేసే ఆరోపణల్లో ఏ మాత్రం లాజిక్ కనిపించడం లేదని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

అలాగే సోషల్ మీడియాలో మంత్రి కుమారుడు బెంజ్ కారుతో ఉన్న ఫోటోలని, మన మంత్రి వారసుడు బెంజ్ కారు తీసుకున్నారని వైసీపీ కార్యకర్తలు పెట్టిన పోస్టులని టీడీపీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. అయినా ఒక మంత్రి కుమారుడు ఎవరో కారు పక్కన ఫోటో దిగే స్టేజ్ ఉందా ? అని అడుగుతున్నారు. మంత్రి మాత్రం బెంజ్‌పై నమ్మశక్యం కాని మాటలని చెబుతున్నారని తమ్ముళ్ళు విమర్శిస్తున్నారు.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version