ఆ సమయంలో కూడా చంద్రబాబు ప్రజల గురించే ఆలోచించారు : మంత్రి నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయింది. సీఎం చంద్రబాబు ఏం చెబుతారోనని వచ్చిన వ్యాపారవేత్తలు, యూరఫ్ ఎన్నారై టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంత మంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్ లో ఉన్నామా..? లేక జువ్వలపాలెంలో ఉన్నామా..? అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేసారు. 

తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి చంద్రబాబు.. ఆయన చేతిలో ఫైళ్లు పట్టుకొని న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ ఇవాళ హైదరాబాద్ ను చూస్తే.. ఆయన ఆనాడు చెప్పిన ప్రతీ మాట నిజమని నమ్మాల్సిందే. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చాలా కృషి చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలుంటాయి. ఆయనను అరెస్ట్ చేసిన సమయం నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం. కానీ ఆయన మాత్రం భయపడలేదు. ఆ సమయంలో కూడా ప్రజల గురించే ఆలోచించారని తెలిపారు నారా లోకేష్.  

Read more RELATED
Recommended to you

Latest news