ఏపీలోని ఉమ్మడి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ బేటీ అవుతున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మొన్నటి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. టీడీపీకి సభ్యులు లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు జగన్. మన ప్రభుత్వంలో టీడీపీ రెండే రెండు మున్సిపాల్టీలు గెలిచింది. మనం గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండు కూడా వారికి వచ్చి ఉండేవి కావని.. కానీ, మనం ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ఆ ఫలితాలను గౌరవించామని తెలిపారు.
టీడీపీ తప్పుడు సంప్రదాయాలకు పాల్పడుతోందన్నారు. కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ముసలమ్మకూడా బటన్లు నొక్కుతుందని చంద్రబాబు అన్నారు.. ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నారు.. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు.. మరి ఈవ్యక్తి చీటర్ కాదా..? అని ప్రశ్నించారు.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..? అని వ్యాఖ్యానించారు. ఇక, తిరోగమనంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్ధం, మోసం.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు జగన్.