మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ కేటీఆర్ అనుచురుడిదే అంటూ ప్రచారం చేస్తున్నారు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ లో క్యాసినో, పేకాట, కోళ్ల పందాలు నిర్వహిస్తూ పట్టుబడింది కేటీఆర్ అనుచరుడు, ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక కేటీఆర్ తో గతంలో… ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ దిగిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాగా, హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి ఓ ఫాంహౌస్‌లో కోడి పందేలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు జరిపారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఇందులో పాల్గొన్న 64 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సోదాల్లో భాగంగా క్యాసినో ఆడుతున్న వ్యక్తులు.. రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. అంతేకాకుండా 86 పందెం కోళ్ళు, బెట్టింగ్ కాయిన్స్, పందెం కోళ్లకు ఉపయోగించే 46 కోడి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ, అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ ఈవెంట్ కు కేటీఆర్ అనుచరుడు, ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ అంటున్నారు.
మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో క్యాసినో, పేకాట, కోళ్ల పందాలు నిర్వహిస్తూ పట్టుబడిన కేటీఆర్ అనుచరుడు, ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ https://t.co/Rv5ZeWhMWf pic.twitter.com/LW7s1JOxm2
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025