తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ మేరకు ప్రకటన వచ్చింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమకానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 2 ఎకరాలలోపు… రైతులకు రైతు భరోసా నిధులు వేశారు.
ఇక నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. కాగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన నుంచి రైతు భరోసా నిధులు పడలేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేసీఆర్ సర్కార్ ఎకరానికి రూ.10 వేలు ఇవ్వగా… రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధులు రూ.12 వేలు ఇస్తోంది.