స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసి పని చేయాలి : సీఎం చంద్రబాబు

-

స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసి పని చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. తాజాగా కడప జిల్లాలోని మైదుకూరులో నిర్వహించిన  బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీల్లో స్వచ్ఛతకు ముందుకు వెళ్తున్నాం. ఇతర దేశాల్లో రోడ్లపై చెత్త వేయరు. డస్ట్ బిన్లలోనే చెత్త వేస్తారు. మనం కూడా అలాగే చెత్తను వేస్తే.. ఆ చెత్త ద్వారా చాలా ఉపయోగాలుంటాయని తెలిపారు.

ఇంట్లో వారిని మోటివేషన్ చేయాలి.. సమిష్టిగా అందరూ చర్చించుకొని సమస్యలను పరిస్కరించుకోవాలి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ మైండ్ ను అదుపులో ఉంచుకొవాలి. చెడు ఆలోచనలు రాకుండా  మంచి ఆలోచనలపై దృష్టి పెట్టాలని సూచించారు. దేశ విదేశాలు ప్రధాని నరేంద్ర మోడీకి పరిశుభ్రత పై నివేదికను ఇచ్చినట్టు తెలిపారు. ప్రతీ నెల మూడో శనివారం  ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో స్వచ్ఛ ఆంధ్రా  కార్యక్రమం నిర్వహించాలి. మీరు ఒక స్ఫూర్తి దాయకం కావాలన్నారు. ఇలా చేస్తే.. రాష్ట్రానికి చాలా లాభాలు వస్తాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news