BREKAING : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు

-

BREKAING : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న దుబ్బాకలోని హబ్సిపూర్ చౌరస్తా వద్ద బీసీ బంధు బీసీలందరికి ఇవ్వాలని ధర్నా చేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

సిద్దిపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నా ఎటువంటి అనుమతులు లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు..ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు మరి కొంతమంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా… నేడు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ బహిరంగ సభ జరుగనుంది.

ఈ బహిరంగ సభలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల, ఎన్నికల నిర్వహణ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొననున్నారు. ఇక ఈ బహిరంగ సభలో బీజేపీలో చేరనున్నారు సంగారెడ్డి BRS నేత పులిమామిడి రాజు. కొన్ని రోజుల క్రితం BRS నుంచి టికెట్ ఆశించి బంగపడ్డాడు పులిమామిడి రాజు. ఇక ఇవాళ బీజేపీలో చేరనున్నారు సంగారెడ్డి BRS నేత పులిమామిడి రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version