వేములవాడ పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి కూల్చివేతలు జరుగుతున్నాయి. రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణ పనులను వేగవంతం చేస్తున్నారు. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని గత 15 రోజుల క్రితమే అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల గడువు పూర్తవడంతో సుమారు 30 వెళ్ళాలని అధికారులు కూల్చి వేయడం ప్రారంభించారు. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే తమ ఇళ్ళను కూల్చి వేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూల్చివేతలకు ముందే పరిహారం కోర్టులో జమ చేశారు. ఇదిలా ఉండగా… ఈరోజు కలెక్టర్ సందీప్ కుమార్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అంతేకాకుండా బాధితులతో కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు. వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. బాధితులతో రోడ్డు విస్తరణ పనులు జరిగితే వేములవాడ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని మీకు ఉన్న భూములు, షాపులకు విలువ పెరుగుతుందని బాధితులతో అన్నారు.