విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. అగ్ని ప్రమాదం భారీగా సంభవించడంతోనే మంటలు ఎగిసిపడుతున్నాయి. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్ లో మొదలయ్యాయి మంటలు. ప్రధానంగా ఇతర బ్లాకుల్లోని పేషంట్ల కు ఇబ్బంది తలెత్త కుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఫైర్ ఫైటర్ తో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఫైర్ ఇంజిన్ తో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి వెనుక వైపున పేషెంట్లను తరలించారు. ఆసుపత్రి వెనుక భాగం వైపు మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుంది. అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం అసలు తెలియడం లేదు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 5వ అంతస్తులో మంటలు అంటుకోగా 6వ అంతస్తులో పొగ రావడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వారికి ప్రమాదం జరుగకుండా జాగ్రత్తలను తీసుకుంటున్నారు.