ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరం లో ఇద్దరి పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ముఖ్యంగా పాత సామాగ్రి కొనుగోలు చేసే వ్యాపారులను తుపాకితో కాల్చడం సంచలనంగా మారింది.
ఈ కాల్పుల ఘటనలో వ్యాపారులు హన్మంత్ (50), రమణ (30)కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. అసలు వ్యాపారులపై కాల్పులు ఎవరు చేశారు..? ఎందుకు చేయాల్సింది. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్నమయ్య జిల్లాలో కాల్పులు ఎక్కువగా కలవరపెడుతున్నాయనే చెప్పాలి. ఇటీవల భూ వివాదంతో జిల్లాలోని చిన్నమండెం మండలం దిగువ గొట్టి వీడులో నాటు తుపాకితో కాల్పులు జరిగిన విషయం విధితమే.