స్వర్ణముఖి బ్యారేజికి పెరిగిన వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

-

మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. స్వర్ణముఖి నదిలోకి భారీగా వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాకాడులో స్వర్ణముఖి బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి పెరగడంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా.. అవి మొరాయిస్తున్నాయని చెప్పారు. దీంతో గేట్ల పైనుంచి వరదనీరు పొంగి ప్రవహిస్తోందని వెల్లడించారు.

- Advertisement -

నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను ప్రభావంతో విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలు స్తంభించిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేల కూలాయి. వరద నీటితో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...