Former CM YS Jagan will visit Kadapa district: కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్…ఈ మేరకు కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు.

ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ నెల 6 ,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్…రేపు ఉదయం బయలు దేరురారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఇడుపులపాయకు వైఎస్ షర్మిల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అటు వైఎస్ షర్మిల కూడా విజయవాడలో అదే రోజున ఓ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు.