కర్నూలులో దారుణ హత్య చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా శరీన్ నగర్ లో మాజీ కార్పొరేటర్ సంజన్న దారుణ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం సంజన్న…టీడీపీ లో కొనసాగుతున్నాడు. సంజన్న కుమారుడు జయరాం 30వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గా ఉన్నారు. 30వ డివిజన్ లో అధిపత్యపోరు లో భాగంగా హత్య చేశారు ప్రత్యర్థులు.
చాలా ఏళ్లుగా వడ్డె రామాంజనేయులు, సంజన్న కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరింది సంజన్న కుటుంబం. ఈ తరుణంలోనే… వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం కాపుకాచి వేటకొడవాళ్ళతో దాడి చేసి సంజన్నను హత్య చేసింది వడ్డె రామాంజనేయులు వర్గం.