అన్నీ తానొక్కడినే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. 2018లో పోరాట యాత్ర చేశామని తెలిపారు. ఓడినా.. అడుగు ముందుకే వేసి నిలబడ్డాం. అలాగే మన పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామన్నారు. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు.. తొడలు కొట్టారు. మన ఆడపడచులను అవమానించారు.
ముఖ్యంగా ప్రజలను నిరంతరం హింసించారు. ఇది ఏమి న్యాయం అని అడిగితే జన సైనికులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని సైతం జైలుకు పంపారు. నాపై చేయని కుట్ర లేదు.. కుతంత్రాలు లేవు. ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ కూడా తాకలేవని హేళన చేశారు. మనం రికార్డులు బద్దలు కొట్టాం. ఛాలెంజ్ చేసిన ఆ తొడలను బద్దలు కొట్టాం అని సెన్షేషన్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్.