త్రి భాష వాదన సరికాదు.. భారతదేశానికి బహుభాషలే కావాలని జనసేనాని స్పస్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాది పై హిందీని రుద్దుతున్నారని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దన్నారు. మీకు డబ్బులేమో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా..? అని ప్రశ్నించారు. హింది మాత్రం వద్దా..? ఇదేం న్యాయమన్నారు.
ఏ రాష్రంలోని ముస్లింలు అయినా అరబిక్ లో ప్రార్థిస్తారు. కానీ ఎన్నడూ ఆ భాష మనకొద్దూ అని అనరు. హిందువులు మాత్రం దేవాలయాల్లో సంస్కృత మంత్రాలు చదవద్దు అంటారు. అందుకే ముస్లింలను చూసి హిందువులు నేర్చుకోవాలి. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గిపోతుందని.. ప్రకటనలు చేస్తున్న వారు నిజంగా అవి తగ్గుతాయో లేదో చర్చకు పెట్టాలన్నారు. అంతే తప్ప రూపాయి సింబల్ మార్చేసి తమిళ భాషలో పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు.