Former minister Alla Nani joined TDP: జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది… టీడీపీలో చేరారు వైసీపీ మాజీ మంత్రి. తాజాగా టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఈ సందర్బంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.

ఇక అటు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏలూరుకు చెందిన టీడీపీ పార్టీ క్యాడర్.. ఆళ్ల నాని చేరికతో క్యాడర్ లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొన్నటి వరకు ఆలోచనలో పడింది టీడీపీ పార్టీ. దీంతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది ఆళ్ళ నాని చేరిక అంశం. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై పునరాలోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని.