ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఈ రోజు అంటే బుధవారం మధ్యాహ్నాం టీడీపీలో చేరనున్నారు. అమరావతిలో చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారు.
టీడీపీ అధిష్ఠానం సూచన మేరకు ఆళ్ల నాని చేరికకు తాను అంగీకరించినట్లు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. కాగా.. నాని రెండు నెలల క్రితం వైసీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఇటీవలే మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఛీటింగ్ కేసు నమోదు నమోదు అయింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. అయితే… ఇలా వరుసగా కేసులు నమోదు అవుతున్న తరుణంలోనే.. జంప్ అవుతున్నారట మాజీ మంత్రి ఆళ్ల నాని.