మాజీ మంత్రి జోగి రమేష్ కు మూడోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ 4 గంటలకు విచారణకు రావాలని జోగి నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు…. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇవ్వగా ఒకసారి విచారణకు హాజరైయ్యారు జోగి రమేష్. నిన్న జోగి హాజరు కాకపోవడంతో ఆయన తరఫున న్యాయవాదులు పోలిసులకు కలిసి వివరణ తెలియజేశారు. తాజాగా నిన్న రాత్రి మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇక అటు వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ కు మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు. అయితే.. ఈ నోటీసులపై వెంటనే రియాక్ట్ అయ్యారు వైసీపీ నేత దేవినేని అవినాష్. విచారణకు రావడం కోసం 10 రోజుల సమయం కోరారు అవినాష్ తరఫున న్యాయవాదులు.