ఏపీలో వడదెబ్బకు నలుగురు మృతి చెందారు. తీవ్ర ఎండలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు. నిన్న ప్రకాశం జిల్లాలో వడదెబ్బకు గురై నలుగురు మరణించారు. కే.బిట్రగుంటలో సాబినేని సుబ్బమ్మ(56), సూరిబాబు(57), సుబ్బరామిరెడ్డి(68), పాత సింగరాయకొండలో కొట్టే పేరమ్మ(65) మృతి చెందారు.
కాగా, నిన్న నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4, ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణ జిల్లా కొండూరులో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడూ అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ రోజు 9 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వివరించింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది.