ఏపీలో ఫాక్స్ కాన్ మెగా సిటీ.. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

-

ఆంధ్రప్రదేశ్ లో భారీగా పెట్టుబులకు ఫాక్స్ కాన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య సూత్రప్రాయ ఒప్పందం జరిగింది. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఫాక్సాకాన్ బృందానికి లోకేన్ స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి లోకేశ్ వారికి వివరించారు. త్వరలోనే దేశంలో ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీ కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు.

ఏపీలో ఫాక్స్ కాన్  మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేశ్ కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సీఎం చంద్రబాబు చొరువతో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పలు కంపెనీలలో ఫాక్స్ కాన్ కూడా ఒకటి అని లోకేష్ గుర్తుకు చేసారు. ఈ సంస్థ నిర్మించే మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version