సీతక్క – రేవంతులకే రాఖీ పండుగ కాదు… గంట సంచలన పోస్ట్ ?

-

సాధారణంగా రాఖీ పండుగ అంటే సోదరి, సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీక అనే చెప్పాలి. తన సోదరుడు తనకు రక్ష.. తాను తన సోదరికి రక్ష అనే విధంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. వాస్తవానికి భారతదేశ వ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటారు. గతంలో రాఖీ పండుగకు ప్రభుత్వ హాలీ డే కూడా ఉండేది. కానీ ఈ ఏడాది ఏమైందో కానీ తెలంగాణ రాష్ట్రంలో రాఖీ పండుగకు ప్రభుత్వ సెలవు లేకపోవడం గమనార్హం.

దీనిపై టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణీ ఓ సంచలన ట్వీట్ వేశారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్క సీతక్క-రేవంతన్నలే కాదు. ప్రతి అక్కకు, తమ్ముడికి అదొక ప్రత్యేక సందర్భం అని చెప్పారు.  అసలైతే రాఖీ కట్టడానికి వెళ్లాలనుకున్న పిల్లలకు సెలవు ఇవ్వాల్సింది పోయి.. అక్కలతో రాఖీ కట్టించుకోవాలని వచ్చిన ఈ చంటి పిల్లోడిని లోపలికి అనుమతించలేదట.  అసలు ఏం రోగమో అంటూ  వేసిన సంచలన ట్వీట్ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version