గన్నవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ సాగిస్తున్న గత ఎన్నికల అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు.. తాజాగా టీడీపీలోకి వెళ్తున్నా అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను, అపాయింట్ మెంట్ ఇవ్వాలని చంద్రబాబు ని కోరుతున్నాను అని మాట్లాడాడు. టీడీపీ టికెట్ ఇస్తుందో లేదో నాకు తెలియదు. కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వక పోయినా ఆయన్ని అసెంబ్లీలో కలుస్తాను.వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్, గన్నవరం నుంచి గెలిచి నేను అసెంబ్లీకి వెళ్లి కలుస్తాను అని చెప్పుకొచ్చారు.
సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా సజ్జల వ్యాఖ్యలు తనను బాధకు గురి చేశాయి అన్నారు. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారు.టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ది చేశాను. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారు. పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు. 2019లో సరిపోయిన నా బలం మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదు అన్నారు. తడి గుడ్డతో గొంతు కోయటం నాకు జరిగింది అని.. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వారు రావడమేనా పార్టీకి బలం అని ప్రశ్నించారు యార్లగడ్డ వెంకట్రావు.